Home సినిమా వార్తలు Nani beats Pawan Kalyan పవన్ కళ్యాణ్ ని బీట్ చేసిన నాని

Nani beats Pawan Kalyan పవన్ కళ్యాణ్ ని బీట్ చేసిన నాని

Nani PawanKalyan

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా విజయాలతో మంచి జోష్ తో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని చేసిన మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీని ప్రముఖ నిర్మాత డి వివి దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మించగా యువ అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. 

ఈ  మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించగా సీనియర్ యాక్టర్ సాయి కుమార్ ఒక ముఖ్య పాత్ర చేసారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన సరిపోదా శనివారం మూవీలో సూర్య గా అద్భుతంగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు నాని. 

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ అమెరికాలో 2.45 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టి, అక్కడ పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ అయిన భీమ్లా నాయక్ ని బీట్ చేసింది. ఈ విధంగా పవర్ స్టార్ ని నాచురల్ స్టార్ నాని బీట్ చేసారు. మరి రాబోయే రోజుల్లో ఓవరాల్ గా సరిపోదా శనివారం ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version