టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో అశుతోష్ రానా, అనిల్ కపూర్ తదితరులు నటించారు. అయాన్ ముఖర్జీ తీసిన ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.
అయితే ఇటీవల ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన వార్ 2 మూవీ నెగటివ్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దారుణంగా కొనసాగుతోంది. దీనితో ఆల్మోస్ట్ బయ్యర్స్ చాలామందికి నష్టాలు వాటిల్లాయి. ఇక ఏ ఈమూవీ యొక్క తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన యువ నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగి బయ్యర్స్ కి న్యాయం చేసేందుకు సిద్ధం అయ్యారు.
తన గత సినిమా కింగ్డమ్ నష్టాలకు గాను కొందరు బయ్యర్స్ కి వార్ 2 కొంత అమౌంట్ కి అందించిన వంశి, ప్రస్తుతం వార్ 2 నష్టాలకు గాను రానున్న మాస్ జాతర ద్వారా ఆదుకోనున్నారట. రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన ఈమూవీ ఆగష్టు 27న రిలీజ్ కానుంది.
వార్ 2 వాళ్ళ నష్టపోయిన బయ్యర్స్ కి మాస్ జాతర హక్కులు అందించనున్నారని, తద్వారా వారు నష్టాలను భర్తీ చేసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు వార్ 2 తెలుగు రాష్ట్రాల లాస్ గురించి యష్ రాజ్ ఫిలిమ్స్ వారితో నాగవంశీ సంప్రదింపులు జరుపుతున్నారట. వారి నుండి కొంతమేర నష్టపరిహారం లభించనున్నట్లు సమాచారం.