Home సినిమా వార్తలు Mohanbabu as Antagonist in Nanis Paradise నాని ‘ప్యారడైజ్’ లో విలన్ గా కలెక్షన్...

Mohanbabu as Antagonist in Nanis Paradise నాని ‘ప్యారడైజ్’ లో విలన్ గా కలెక్షన్ కింగ్

mohan babu nani

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇక అతి త్వరలో శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ మూవీ చేయనున్నారు నాని. ఇటీవల వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దసరా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే సొంతం చేసుకుంది.

సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న పారడైజ్ మూవీ త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇటీవల ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో నట ప్రపూర్ణ డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించినట్టు తెలుస్తోంది. అలానే ఈ మూవీలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారట.

అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఇతర స్టార్ కాస్టింగ్ అలానే టెక్నికల్ టీమ్ కి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఒకరకంగా ఇది నటుడిగా నానికి ఛాలెంజ్ అని అద్భుతమైన పర్ఫామెన్స్, డైలాగ్స్ తో అదరగొట్టే మోహన్ బాబుని ఢీకొట్టేలా నటించి నాని ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version