Home సినిమా వార్తలు Maharaja sees huge surge in China చైనాలో దూసుకెళ్తున్న ‘మహారాజా’

Maharaja sees huge surge in China చైనాలో దూసుకెళ్తున్న ‘మహారాజా’

maharaja

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఇటీవల తమిళ్ లో యువ దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన సినిమా మహారాజా. యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయి సక్సెస్ అందుకుని తమిళ్ లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది.

ఇక తాజాగా ఈ సినిమాని చైనాలో గ్రాండ్ లెవెల్ లో 40 వేల స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మొత్తంగా చైనాలో మహారాజా మూవీ ప్రీవియర్స్ పరంగా 640k డాలర్స్ అలానే డే 1 540k డాలర్స్, ఇక డే 2 అయితే అన్నిటికంటే ఎక్కువగా 1.1 మిలియన్ డాలర్స్ ఆర్జించింది. దీన్నిబట్టి మహారాజా మూవీకి చైనీయులు బ్రహ్మరథం పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇక మొత్తం గ్రాస్ పరంగా రెండు రోజుల్లో ఇది 19 కోట్లలైతే రాబట్టింది ప్రస్తుతం డే 3 కూడా అక్కడ భారీ స్థాయి కలెక్షన్ అందుకునే అవకాశం కనబడుతోంది. మొత్తంగా దీనిబట్టి విజయ్ సేతుపతి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచిన మహారాజా మూవీ చైనాలో ఓవరాల్ గా రూ. 100 కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనబడుతోంది. ఒకరకంగా ఇది ఆ మూవీ మేకర్స్ కి మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version