మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో సాహు గారపాటి, సుస్మిత కొణిదల నిర్మాతలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్నటువంటి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకపాత్రలో కనిపించనుండగా నయనతార హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
ఇక ఇటీవల ఆమెకు సంబంధించి మూవీలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ఒక చిన్న ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది టీం. అందులో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఆ వీడియో బైట్ రూపొందింది. నిజానికి నయనతార తాను చేసే సినిమాలుకు సంబంధించి ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనరు అనే విమర్శ ఆమెపై ఉంది.
కాగా ఈ సినిమాతో అనిల్ రావిపూడి దాన్ని బ్రేక్ చేశారు. ఎంట్రీ తోనే ప్రమోషన్స్ లో పాల్గొన్నారు కాబట్టి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఆపైన రిలీజ్ సమయంలో జరిగే ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా నయనతార పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇటీవల వెంకటేష్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ ఇండస్ట్రీట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ మూవీతో ఎంతమేర విజయవంతంటారో చూడాలి. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది.