Homeసినిమా వార్తలుMazaka Censor and Pre Release Business Details 'మజాకా' సెన్సార్ రిపోర్ట్ & ప్రీ...

Mazaka Censor and Pre Release Business Details ‘మజాకా’ సెన్సార్ రిపోర్ట్ & ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ 

- Advertisement -

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఈ మూవీని జీ స్టూడియోస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థల పై రాజేష్ దండా, ఉమేష్ బన్సల్ గ్రాండ్ గా నిర్మించగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. 

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. తాజగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. 

ఇక ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. ల 29. నిముషాలుగా ఉంది. ఆకట్టుకునే ఎంటర్టైనర్ గా రూపొందిన తమ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరిస్తుందని మజాకా టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కోస్టల్ ఏపీ లోని 6 ప్రాంతాల్లో రూ. 4.5 కోట్ల  నుండి 5 కోట్ల నిష్పత్తికి, అలానే నైజాం రూ. 3.5 కోట్లకు మరియు సీడెడ్ దాదాపు రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాయి. 

READ  Sankranthiki Vasthunnam OTT Release Details 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటిటి రిలీజ్ డీటెయిల్స్

మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాపారం దాదాపు రూ. 10 కోట్లకు జరిగింది. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 12 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ ని జీ సంస్థ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. 

Follow on Google News Follow on Whatsapp

READ  Producer Singanamala Ramesh Shocking Comments on Pawan and Mahesh పవన్, మహేష్ ల పై నిర్మాత సింగనమల రమేష్ సంచలన వ్యాఖ్యలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories