Home సినిమా వార్తలు రీ రిలీజ్ కి రెడీ అయిన ‘మాయాబజార్’

రీ రిలీజ్ కి రెడీ అయిన ‘మాయాబజార్’

mayabazar

భారతీయ సినీచరిత్రలో ప్రస్తుతం పలు భాషల యొక్క హిట్ మరియు ప్లాప్ సినిమాలు అప్పుడప్పుడు రీ రిలీజ్ అవుతూ నేటి ఆడియన్స్ కి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నాయి. ఆ విధంగా ఇటీవల తెలుగులో కూడా పలు సినిమాలు మన ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఇక కొన్నేళ్ల క్రితం కలర్ వర్షన్ కి మారినటువంటి ఒకప్పటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మాయాబజార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, సావిత్రి, ఎస్వీయార్, రుషేంద్రమణి వంటి దిగ్గజ నటీనటులు నటించిన ఈ సినిమాని కె.వి.రెడ్డి తెరకెక్కించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ఈమూవీలో అభిమన్యుడిగా ఏఎన్నార్, అలానే ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

అప్పట్లో అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా కలర్ వర్షన్ 2010లో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే మే 28న స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ఈ సినిమాని మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్.

తప్పకుండా ఈ సినిమా రీరిలీజ్ లో కూడా విజయవంతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజాగా దీనికి సంబంధించి ఒక ఈవెంట్ లో రీ రిలీజ్ ని అనౌన్స్ చేశారు. మరి మాయాబజార్ మరొక్కసారి మన ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో ఏ స్థాయిలో కలెక్షన్ రాబడుతుందో చూద్దాం. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version