Home సినిమా వార్తలు ‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా ?

‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా ?

mass jathara

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ మాస్ జాతర.

ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూరన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ మూవీ నుండి మొదటిగా రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకోలేదు.

అయితే తాజాగా రిలీజ్ అయిన రెండు సాంగ్స్ పర్వాలేదన్పించే స్పందన అందుకున్నాయి. మొత్తంగా ప్రస్తుతం మాస్ జాతర ఆడియన్సు లో పెద్ద బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీని ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించిన మేకర్స్ మూవీని వాయిదా వేసేందుకు ఫిక్స్ అయ్యారు.

అయితే పక్కాగా ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అర్ధం కాక అటు రవితేజ ఫ్యాన్స్, ఆడియన్సు తలలు పట్టుకుంటున్నారు.అందుతున్న సమాచారం ఈ మూవీ అక్టోబర్ చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. మొత్తంగా టీమ్ నుండి పక్కాగా మాస్ జాతర లేటెస్ట్ రిలీజ్ పై క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version