Home సినిమా వార్తలు Maharaja Record in Netflix నెట్ ఫ్లిక్స్ లో ‘మహారాజా’ సెన్సేషనల్ రికార్డు

Maharaja Record in Netflix నెట్ ఫ్లిక్స్ లో ‘మహారాజా’ సెన్సేషనల్ రికార్డు

maharaja

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో యువ దర్శకుడు నిథిలన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ మహారాజా. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలో కూడా మరొక్కసారి తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి.

ఇక మహారాజా తమిళ్ తో పాటు తెలుగులో కూడా బాగానే కలెక్షన్ రాబట్టింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెగటివ్ పాత్ర చేసిన ఈ మూవీలో మమతా మోహన్ దాస్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, దివ్య భారతి తదితరులు ఇతర పాత్రలు చేసారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీని ది రూట్ థింక్ స్టూడియోస్, పాషన్ స్టూడియోస్ గ్రాండ్ గా నిర్మించాయి.

విషయం ఏమిటంటే, కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన మహారాజా మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని తాజాగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న మూవీగా టాప్ ప్లేస్ లో నిలిచింది. కాగా నెట్ ఫ్లిక్స్ లో అంతకముందు బాలీవుడ్ మూవీ క్రూ 17.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా 18.6 మిలియన్ వ్యూస్ తో మహారాజా దానిని బీట్ చేసి టాప్ చైర్ దక్కించుకుని సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version