ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. RRR విడుదలైన దాదాపు 1 సంవత్సరం తర్వాత, ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ 30 ప్రారంభించబడింది. ఈ సినిమా పూజా కార్యక్రమం కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో జరిగింది, ఈ వేడుకకు దర్శకుడు కొరటాల శివ, నటి జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు అనిరుధ్ సహా సినిమాకి సంభందించిన సిబ్బంది అంతా హాజరయ్యారు.
ఇక ఈ సందర్భంగా కొరటాల శివ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను వివరించడం చాలా ఆసక్తికరంగా జరిగింది. ఈ చిత్రం భారతదేశంలోని సుదూర ప్రదేశం మరియు మరచిపోయిన తీర ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమా తన బెస్ట్ ఫిల్మ్ అవుతుందని కూడా హామీ ఆయన హామీ ఇచ్చారు. ఈ చిత్రం గురించి కొరటాల మాట్లాడుతూ, “ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటాయో, దేవుడు అంటే భయం లేదు చావు అంటే భయం లేదు కానీ ఒకే ఒక్కటి అంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది”అని అన్నారు.
కొరటాల చెప్పిన మాటలు ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఇద్దరూ సినిమా కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే సినిమా ఆలస్యం కావడం వల్ల వారు చాలా కలవరపడ్డారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ని అతని అత్యంత మాస్ అవతార్‌లో ప్రదర్శిస్తుందని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కాబోతోంది. కాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో నటించనున్నారు మరియు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ని నిర్వహించనున్నారు.