Homeసినిమా వార్తలుNandamuri Balakrishna: ఒక ఓటీటీ ఛానెల్‌తో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్న నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: ఒక ఓటీటీ ఛానెల్‌తో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్న నందమూరి బాలకృష్ణ

- Advertisement -

గత కొన్నేళ్లుగా బాగా వృద్ధిలోకి వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వెబ్ సిరీస్‌ల ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలకు కూడా పట్టుకుంటుంది. వెంకటేష్ తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నారని తెలియ వచ్చింది.

ఒక ఆసక్తికరమైన పరిణామంలో, ఈ సీనియర్ హీరో ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్ కోసం డిస్నీ + హాట్‌స్టార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా నందమూరి అభిమానులతో పాటు మిగతా వారికి కూడా ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి.

ఓటీటీ విషయానికి వస్తే బాలయ్యకు ఆ వేదిక కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే రెండు సీజన్‌లుగా విజయవంతమైన టాక్ షో అన్‌స్టాపబుల్‌ని ఆహాతో హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో యొక్క రెండు సీజన్లు బాలకృష్ణను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి మరియు అభిమానులు కూడా బాలకృష్ణ యొక్క సరికొత్త కోణాన్ని అన్‌స్టాపబుల్‌లో చూడగలిగారు.

READ  Varisu: విజయ్ 'వారిసు' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

మరి టాక్ షో వేరు.. వెబ్ సిరీస్ పూర్తిగా భిన్నమైన ఉంటుంది, మరి నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న బాలకృష్ణ ఈ కొత్త పనిని ఎలా చేపడతారు అనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల, వెంకటేష్ యొక్క రానా నాయుడు అనేక అభ్యంతరకరమైన సన్నివేశాలు మరియు అసభ్యత కలిగి ఉన్నందుకు గానూ వివాదంలో నిలిచింది.

మరి బాలయ్య విషయానికి వస్తే, ఆయన కేవలం నటుడిగానే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా కూడా ఉండటంతో ఆయనతో వెబ్ సిరీస్ తీసే నిర్మాతలు ఏ దారిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories