Home సినిమా వార్తలు Kayadu Lohar to Act with Vishwaksen విశ్వక్ సేన్ – అనుదీప్ మూవీలో హీరోయిన్...

Kayadu Lohar to Act with Vishwaksen విశ్వక్ సేన్ – అనుదీప్ మూవీలో హీరోయిన్ గా కయదు లోహర్ 

vishwak sen

ఇటీవల లైలా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన యువ నటుడు విశ్వక్సేన్ ఆ మూవీ ద్వారా ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ముఖ్యంగా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొన్ని వర్గాల ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉండడం ఓవరాల్ గా కథ కథనాలు కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడంతో లైలా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. 

నటుడుగా ఇక పై ఆ విధమైన ఇబ్బందికర సన్నివేశాలు తమ సినిమాల్లో ఉండకుండా చూసుకుంటాను అంటూ ఒక ప్రెస్ నోట్ ని కూడా విశ్వక్సేన్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం ఏమిటంటే త్వరలో తన నెక్స్ట్ మూవీని జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తో చేయడానికి సిద్ధమయ్యారు విశ్వక్. 

ఇక ఈ మూవీలో ఇటీవల డ్రాగన్ మూవీ ద్వారా పెద్ద విజయం అందుకున్న టాలీవుడ్ కథానాయిక కయదు లోహర్ హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఈ మూవీకి ఫంకీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ నిర్ణయించారు. నేడు గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version