Home సినిమా వార్తలు Kantara: ‘కేజీయఫ్’కు ఎసరు పెట్టిన కాంతార.. ఎక్కడో తెలుసా?

Kantara: ‘కేజీయఫ్’కు ఎసరు పెట్టిన కాంతార.. ఎక్కడో తెలుసా?

Kantara: ‘కేజీయఫ్’కు ఎసరు పెట్టిన కాంతార.. ఎక్కడో తెలుసా?

Kantara To Break Lifetime Record Of KGF 1 In Bollywood
Kantara To Break Lifetime Record Of KGF 1 In Bollywood

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కించిన రిషబ్ శెట్టి, అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఈ సినిమా కంటెంట్‌కు ఇతర భాషా ప్రేక్షకులు సైతం సలాం కొడుతున్నారు.

ఈ సినిమాకు కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా కాంతార హిందీ వెర్షెన్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే అక్కడ రూ.38 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార మరో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీయఫ్’ లైఫ్‌టైం రికార్డును తొక్కేయడానికి రెడీగా ఉంది.

రాక్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-1 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.44 కోట్ల లైఫ్‌టైం కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పుడు కేజీయఫ్ రికార్డులను గల్లంతు చేసేందుకు కాంతార రెడీ అవుతోంది. ఈ లెక్కన కాంతార హిందీ బెల్ట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కేజీయఫ్ లైఫ్‌టైం రికార్డులకు ఎసరుపెట్టిన కాంతార టోటల్ థియేట్రికల్ రన్‌లో ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version