Home సినిమా వార్తలు అంచనాలు పెంచేసిన ‘కన్నప్ప’ ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘కన్నప్ప’ ట్రైలర్

kanappa trailer

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడిగా కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా నటిస్తుండగా కీలకమైన రుద్ర పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాత్రధారుల యొక్క పోస్టర్స్ తో పాటు సాంగ్స్ కూడా బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నేడు కొద్దిసేపటి క్రితం కన్నప్ప నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ లో ప్రధాన పాత్రధారులు అందరినీ చూపించారు.

ముఖ్యంగా యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి తిన్నడు గా విష్ణు మంచుతో పాటు అందరి పాత్రలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫి కూడా ఎంతో బాగుంది. ఓవరాల్ గా కన్నప్ప ట్రైలర్ సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి. ప్రభాస్ రుద్ర పాత్ర ట్రైలర్ లో ఎంతో ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవు. రూ. 200 కోట్లతో తీస్తున్న మూవీ కాబట్టి అవి మరింత రిచ్ గా ఉంటే బాగుండేది.

జూన్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న కన్నప్ప మూవీని ఏవియే ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ సంస్థల పై మంచు విష్ణు భారీ స్థాయిలో నిర్మించారు. ఇంకా ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు.మరి రిలీజ్ తరువాత కన్నప్ప ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version