​Kannappa Teaser Release Date Time Fixed ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

    kannappa

    మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీని ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, మధుబాల, ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. 

    ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. 

    స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి షెల్డన్ చావ్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ చేసారు మేకర్స్. కాగా ఈ టీజర్ రేపు ఉదయం 11 గం. లకు విడుదల కానుంది. తప్పకుండా తమ మూవీ అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడం ఖాయమని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version