Home సినిమా వార్తలు Kanguva 30 Crore Loss in Overseas ఓవర్సీస్ లో ‘కంగువ’ కు రూ. 30...

Kanguva 30 Crore Loss in Overseas ఓవర్సీస్ లో ‘కంగువ’ కు రూ. 30 కోట్ల లాస్

kanguva

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ క్రియేషన్, యువి క్రియేషన్స్ సంస్థలపై గ్రాండ్ గా నిర్మితమైన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఇటీవల భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో దిశ పటాని హీరోయిన్ గా నటించారు.

ఇక కంగువ అటు తమిళ్ తో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో కూడా భారీ నష్టాలు చవిచూసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడవ్వగా ఇది ఓవరాల్ గా రూ. 24 కోట్ల గ్రాస్ ని అనగా కేవలం రూ. 10 కోట్ల షేర్ ని మాత్రమే ఆర్జించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్సీస్ లో ఈ మూవీ 30 కోట్ల లాస్ ను మూటగట్టుకుంది. అలానే ఇతర ప్రాంతాల్లో కూడా కంగువ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా చాలావరకు లాస్ అయ్యారు.

కంగువ మూవీ ఓవరాల్ గా క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ రూ. 105 కోట్లని మాత్రమే అందుకుంది. నిజానికి ఈ మూవీ భారీ హిట్ అవుతుందని అలానే ఓవరాల్ గా 1000 కోట్ల మార్కు చేరుకుంటుందని అందరూ భావించారు, నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేసారు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 400 కోట్ల బ్రేకీవెన్ అందుకోవాల్సిన ఈ సినిమా కేవలం 25% మాత్రమే రికవరీతో భారీ డిజాస్టర్ గా నిలిచి అందరికీ భారీ షాక్ ఇచ్చింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version