Home సినిమా వార్తలు Ram 22nd Movie Heroine Fixed రామ్ 22వ మూవీలో యంగ్ బ్యూటీ ఫిక్స్

Ram 22nd Movie Heroine Fixed రామ్ 22వ మూవీలో యంగ్ బ్యూటీ ఫిక్స్

ram 22

టాలీవుడ్ యంగ్ యాక్టర్ రామ్ పోతినేని ఇటీవల డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా మెలోడీ బ్రాహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక దాని అనంతరం కెరీర్ పరంగా కొంత ఆలోచనలో పడ్డ రామ్, మొత్తంగా ఒక యంగ్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇటీవల స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ల కలయికలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని తెరకెక్కించిన పి మహేష్ నెక్స్ట్ తన మూవీని రామ్ తో చేయనున్నారు. ఇటీవల ఈ క్రేజీ ప్రాజక్ట్ కి సంబంధించి కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఆ ప్రాజక్ట్ సెట్ అవ్వడంతో పాటు దానిని రేపు గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీలో మెప్పించిన యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు నేడు మేకర్స్ ఆమెని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version