Home సినిమా వార్తలు Kamal Haasan Lucky Date Set for Thug Life ‘థగ్ లైఫ్’ : కమల్...

Kamal Haasan Lucky Date Set for Thug Life ‘థగ్ లైఫ్’ : కమల్ హాసన్ లక్కీ డేట్ కి రిలీజ్

thug life

యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో కెరీర్ పరంగా అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ నటుడు ఉలగనాయగన్ కమలహాసన్. ఇక దాని అనంతరం ఒక్కొక్కటిగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్న కమల్ ప్రస్తుతం సీనియర్ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ నటుడు శింబు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ టీజర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన థగ్ లైఫ్ మూవీ నుంచి నేడు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కమల్ హాసన్, శింబు ల యాక్షన్ పెర్ఫార్మన్స్ తో పాటు ఇతర అంశాలన్నీ కూడా టీజర్ లో ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక సినిమాని వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ అయితే అనౌన్స్ చేశారు.

విషయం ఏమిటంటే, కమల్ నటించిన విక్రమ్, కల్కి 2898 AD, దశావతారం మరియు పంచతంత్ర వంటి అతని సినిమాలు జూన్‌లో విడుదలయి బ్లాక్‌బస్టర్‌లుగా కల్ట్ క్లాసిక్‌లుగా నిల్చాయి. ఇక థగ్ లైఫ్ కూడా జూన్ లో రిలీజ్ అవుతుండడంతో ఇది కూడా బ్లాక్ బస్టర్ ఫిక్స్ అని కమల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం అలానే కమల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో నార్మల్ ఆడియన్స్ లో కూడా దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version