Home సినిమా వార్తలు Diwali Boxoffice Fireworks A Setback for Kanguva దీపావళి బాక్సాఫీస్ కంగువకు ఎదురుదెబ్బ?

Diwali Boxoffice Fireworks A Setback for Kanguva దీపావళి బాక్సాఫీస్ కంగువకు ఎదురుదెబ్బ?

kanguva

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు సిరుతై శివ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమవుతున్న తాజా భారీ పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల నటి దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా ఆనిమల్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర చేస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ పోస్టర్లన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. ఇక మూవీని నవంబర్ 14న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. వాస్తవానికి ఈ మూవీని మొదట దసరాకి రిలీజ్ చేద్దాం అని భావించారు, అయితే రజినీకాంత్ వెట్టయాన్ రిలీజ్ ఉండడంతో క్లాష్ లేకుండా కంగువ ని పోస్ట్ పోన్ చేసారు.

అలానే దీపావళి కి రిలీజ్ చేద్దాం అని భావించినప్పటికీ అప్పటికే మరికొన్ని సినిమాలు అప్పటికి రిలీజ్ బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకోవడంతో నవంబర్ 14 న సోలో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది కంగువ టీమ్. అయితే తాజాగా దీపావళి కి రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా మంచి టాక్, కలెక్షన్ తో కొనసాగుతుండడం ఒకింత కంగువ మిస్ చేసుకున్న అవకాశం అని, అది మూవీకి ఎదురుదెబ్బ అని అంటున్నాయి సినీ వర్గాలు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version