టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ దిశగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సి. అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, సస్వత ఛటర్జీ, బ్రహ్మానందం, శోభన తదితరులు నటించారు.
నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే అన్ని ఏరియాల్లో, రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి కలెక్షన్ రాబడుతోంది. ఇక తెలుగు తెలుగు ఆడియన్స్ కూడా కల్కి కి బ్రహ్మరథం పడుతున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం కల్కి 2898 ఏడి మూవీ తెలుగు వర్షన్లో రూ. 200 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్ ని దాటేసింది.
ఇప్పటికే ఐదు రోజులు పూర్తి అయినప్పటికీ కూడా కల్కి తన జోరు చూపిస్తూనే ఉంది. ఈ విధంగా బ్యాక్ టూ బ్యాక్ సలార్, కల్కి 2898 మూవీస్ తో తెలుగులో రూ. 200 కోట్ల షేర్ ని దక్కించుకున్నారు ప్రభాస్. అలానే దీనిని బట్టి సలార్ టోటల్ తెలుగు వర్షన్ కలెక్షన్ ని కల్కి కేవలం మొదటి వారంలోనే దాటేసే అవకాశం గట్టిగా కనబడుతోందని, ఇక ఓవరాల్ గా ఇది రూ. 250 కోట్ల మార్క్ కూడా అందుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మొత్తంగా కల్కి 2898 ఏడి వంటి భారీ మూవీ గ్రాండ్ సక్సెస్ తో టాలీవుడ్ ఖ్యాతి మరింత పెరిగిందని చెప్పాలి.