KA Review An Engaging Thriller that will keep you Hooked ‘క’ రివ్యూ : ఆకర్షణీయమైన ఎంగేజింగ్ థ్రిల్లర్

    ka review

    యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు. తాజాగా ఆయన హీరోలాగా గ్రాండ్ లెవెల్లో రూపొందిన మూవీ క. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచేసింది. యువ దర్శకుడు సుజీత్, సందీప్ కలిసి తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్ గా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది.

    అనాధ అయిన అభినయ్ వాసుదేవ కిడ్నాప్ చేయబడి చీకటి గదిలో బంధించబడతాడు. అతని జీవితంలోని కొన్ని నిర్దిష్ట సంఘటనల గురించి ప్రశ్నించినప్పుడు అతని గతం జ్ఞాపకం రాదు. అయితే, హిప్నోటైజింగ్ మెషిన్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే అతనికి ఈ సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతలో పక్కనే ఉన్న గదిలో ఓ యువతిని కూడా బందీగా ఉంచుతారు. అనంతరం అభినయ్ తన గతంలోని ముఖ్యమైన క్షణాలను గుర్తు చేసుకోవడం ప్రారంభించడంతో కథ ముందుకు సాగుతుంది. అతనికి జ్ఞాపకశక్తి లేకపోవడం వెనుక కారణం ఏమిటి మరియు అభినయ్ దాన్ని అధిగమించాడనికి ఎలా ఒక మార్గాన్ని కనుగొన్నాడు అనే మిగతా అంశాల తో కూడిన కథ, కథనాలతో ఈ మూవీ సాగుతుంది.

    కిరణ్ అబ్బవరం నటుడిగా ఒక్కో సినిమాతో మంచి పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ మూవీలో కూడా నటన బాగుండడంతో పాటు పలు యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో మరింతగా అలరించారు. హీరోయిన్ గా నటించిన నయన్ సారిక కూడా తన అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అభినయ్ జీవితంలో గల మిస్టరీ ని చేధించే కథగా ఎంగేజింగ్ గా ఈ మూవీ స్క్రిప్ట్ ని రాసుకున్నారు దర్శక ద్వయం సుజీత్ సందీప్. ముఖ్యంగా కథనంలో వచ్చే కొన్ని ఊహించని మలుపులు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. కొద్దిపాటి బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ మూవీ తెరకెక్కించిన తీరుని మెచ్చుకోవాలి. అలానే ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు సీన్స్ తో కట్టిపడేసేలా దర్శకులు ఇద్దరూ కూడా కథనాన్ని నడిపారు.

    ప్లస్ పాయింట్స్ :

    స్క్రీన్ ప్లే

    ఇంటర్వెల్ బ్యాంగ్

    సినిమాలో ట్విస్ట్‌లు

    సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్ :

    కొన్ని అనవసరమైన సన్నివేశాలు

    కొన్ని సహాయక పాత్రలు

    ద్వితీయార్ధంలో పేసింగ్ సమస్యలు

    మొత్తంగా క అనేది ఫిలాసఫీ మరియు సస్పెన్స్‌లతో కూడిన ఒక విలేజ్ యాక్షన్ థ్రిల్లర్‌. చలనచిత్రం కొన్ని అక్కడక్కడా స్లో పెసింగ్ కథనం ఉన్నపప్టికీ ఓవరాల్ గా అయితే మిమ్మల్ని ఇది నిరాశపరచాడు. ఒకవేళ మీరు సాధారణ టాలీవుడ్ బ్రాండ్ థ్రిల్లర్‌ల నుండి ప్రత్యేకమైన వాటిని కోరుకుంటే మాత్రం క మూవీ తప్పకుండా మీ అందరికీ మరింత థ్రిల్ ని అందిస్తుంది అని చెప్పవచ్చు.

    రేటింగ్ : 2. 75 / 5

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version