టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో పాటు కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న వార్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న దీనిని యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ కోసం తాజాగా ఎన్టీఆర్, హృతిక్ ల పై సంగీత దర్శకుడు ప్రీతం కంపోజ్ చేసిన ఒక సూపర్ డ్యాన్సింగ్ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు.
ఈ సాంగ్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా అదిరిపోతుందట. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ ల డ్యాన్స్ తో థియేటర్స్ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.