Home సినిమా వార్తలు Jrntr Dragon Movie Shooting starts Tomorrow సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దమైన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ

Jrntr Dragon Movie Shooting starts Tomorrow సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దమైన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ

dragon

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 అందర్నీ ఆకట్టుకుని భారీ విజయం అందుకుంది. దీని అనంతరం తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2. ఈ మూవీపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

అయితే తాజాగా తన తదుపరి సినిమాను కూడా రేపటి నుంచి ప్రారంభించనున్నారు ఎన్టీఆర్. కేజిఎఫ్ సిరిస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ మూవీకి డ్రాగన్ అనే  టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీని నిర్మించనుండగా ఇందులో మలయాళన నటుడు టోవినో థామస్ కీలకపాత్ర పోషించునున్నారు. 

అలానే కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతాన్ని, భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగనుండగా త్వరలో రెండో షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నారట. 

ఇక అక్కడి నుంచి వేగవంతంగా సినిమాని పూర్తి చేసి వీలైనంత త్వరగా దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు టీమ్. వాస్తవానికి ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అది మరికొన్నాళ్లపాటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనపడుతోంది. కాగా వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version