Home సినిమా వార్తలు ఎన్టీఆర్, నాగార్జున ఇది అవసరం అంటారా ?

ఎన్టీఆర్, నాగార్జున ఇది అవసరం అంటారా ?

jr ntr nagarjuna

తాజాగా ఒకేరోజు ఆడియన్సు ముందుకి వచ్చిన రెండు క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ కూలీ, వార్ 2. ముందుగా మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ కూలీలో రజినీకాంత్ హీరోగా నటించగా విలన్ గా సైమన్ పాత్రలో నాగార్జున నటించారు. లోకేష్ కనకరాజ్ తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.

ఇక ఈ మూవీ ఫస్ట్ డే నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ తీసిన స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ తీసిన ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న రఘు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు ఎన్టీఆర్.

అయితే వీటిలో కూలీ మూవీ ఫస్ట్ డే నుండి మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంటోంది తమిళనాడు, ఓవర్సీస్ సహా పలు ప్రాంతాల్లో కూలీ బాగానే ఆడియన్స్ రెస్పాన్స్ ని కూడా అందుకుంటుండగా వార్ 2 మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్ ని మాత్రం అందుకోలేకపోతోంది. తెలుగులో వార్ 2 మూవీ మొత్తంగా రూ. 100 కోట్ల మార్క్ ని కూడా చేరుకోవడం కష్టం.

అలానే హిందీ బెల్ట్ లో కూడా మొత్తంగా టైగర్ 3 పెర్ఫార్మ్ చేసిన మేరకే కలెక్షన్ అందుకునే అవకాశం కనపడుతోంది. ఆ విధంగా అంచనాలు అందుకోలేకపోయింది వార్ 2 మూవీ. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ తన పాత్రలో అద్భుతంగా పెర్ఫర్మ్ చేసారు, అయినప్పటికీ ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర చేసినప్పటికీ తెలుగు వర్షన్ కూడా ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోతోంది.

కూలీ విషయానికి వస్తే తెలుగులో హీరోగా బాగానే మార్కెట్ కల్గిన నాగార్జున ఇటీవల కుబేరలో ఒక కీలక పాత్ర చేసి ఆకట్టుకున్నారు. తాజాగా కూలీ లో ఆయన చేసిన విలన్ పాత్రలో అదరగొట్టినప్పటికీ ఫ్యాన్స్ కొందరు ఆయనని ఆ పాత్రలో ఊహించలేకపొతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ పాత్ర ప్రత్యేకంగా నటుడిగా నాగార్జునకి తెచ్చిపెట్టిన ఇమేజ్ లేదు.

ఆ విధంగా అటు ఎన్టీఆర్, ఇటు నాగార్జున ఇద్దరూ కూడా సరికొత్త చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అందరినీ మెప్పించి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోయాయి. మొత్తంగా ఈ విధంగా వారు పాత్రలు ఎంచుకోవడం అవసరమా అని పలువురు ఆడియన్సు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version