మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మెగా 157. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క షెడ్యూల్స్ వేగంగా జరుగుతున్నాయి.
భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మితతో కలిసి సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి పాత్రని ఆయన ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకడు అనిల్ రావిపూడి రాసుకుని మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీకి చిరంజీవి వాస్తవ పేరైన శివ శంకర వరప్రసాద్ గా అనుకుతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా ఫైనల్ గా మూవీ టైటిల్ ని మన శివశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు.
అయితే దీని పై టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి.