నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. హిట్ సిరీస్ లో ఇదివరకు వచ్చిన సినిమాలను మించి మంచి పాజిటివ్ టాక్ తో బాగా కలెక్షన్ తో ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో ఆడియన్స్ యొక్క మెప్పుతో కొనసాగుతోంది.
ముఖ్యంగా ఈ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని పెర్ఫార్మన్స్ కి ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి ప్రసంశలు కురిపిస్తున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి పలు ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ అందుకుంటుందో. ఇక హిట్ 3 మూవీ ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
నైజాం: రూ. 13 కోట్లు (GST తో సహా)
సీడెడ్: రూ. 3.5 కోట్లు
కోస్టల్ ఆంధ్ర: రూ. 12 కోట్లు (GST తో సహా)
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 5.5 కోట్లు
ఓవర్సీస్: రూ. 11 కోట్లు
మొత్తం షేర్: రూ. 45 కోట్లుGST తో సహా
మొత్తం షేర్: రూ. 41 కోట్లు
కాగా హిట్ 3 మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 47 కోట్లకు అమ్ముడు కాగా, ఇప్పటివరకు 87 శాతం రికవరీ అయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క కలెక్షన్ స్థితి ప్రకారం త్వరలోనే మొత్తంగా పెట్టుబడి రాబట్టి అక్కడి నుండి పూర్తిగా లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనపడుతోంది. ఓవరాల్ గా ఈ మూవీ హీరో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.