Home సినిమా వార్తలు Heroine Anjali Comments ఇంటిమేట్ సీన్స్ పై అంజలి పవర్ఫుల్ కామెంట్స్

Heroine Anjali Comments ఇంటిమేట్ సీన్స్ పై అంజలి పవర్ఫుల్ కామెంట్స్

anjali

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యువనటిగా మంచి క్రేజ్ తో పలు సక్సెస్ లతో ముందుకు సాగుతున్నారు అంజలి. ఇటీవల గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన అంజలీ దానితో ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ బహిష్కరణ.

దీనిని ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించగా రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ళ, షణ్ముఖ్ తదితరులు కీలక పాత్రలు చేసారు. ఇక తాజాగా ఈ సిరీస్ యొక్క ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు మూవీ టీమ్. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అంజలి పవర్ఫుల్ గా సమాధానం ఇచ్చారు. ఈ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ చేసేటపుడు విజయ్, శ్రీతేజ్ లలో ఎవరితో మీకు ఇబ్బందిగా అనిపించింది అని ప్రశ్నించారు.

నిజానికి అది ఒక అసందర్భంగా ప్రశ్న అని చెప్పాలి. కాగా దానికి అంజలి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. తను నటిగా అంజలి అయినప్పటికీ అందులో పుష్ప క్యారెక్టర్ చేస్తున్నందున ఆ క్యారెక్టర్ కి తగినట్లుగా అటువంటి సీన్స్ చేయాల్సి ఉంటుందని ఎంతో ప్రొఫెషనల్ గా అంజలి రిప్లై ఇచ్చారు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ రురల్ యాక్షన్ సిరీస్ జులై 19 నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 లో స్ట్రీమ్ అవుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version