Home సినిమా వార్తలు Tollywood Top 5 Movies టాలీవుడ్ టాప్ 5 మూవీస్ : కేవలం ప్రభాస్ &...

Tollywood Top 5 Movies టాలీవుడ్ టాప్ 5 మూవీస్ : కేవలం ప్రభాస్ & రాజమౌళి మాత్రమే

Tollywood Top 5 Movies

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేక బెంచ్ మార్క్ సినిమాలు సరికొత్త కలెక్షన్ ఒరవడిని సృష్టించాయి. అయితే ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ తరువాత తెలుగుతో పాటు ఏకంగా సౌత్ లోనే సీనిమాల రేంజ్, కలెక్షన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయాయి.

ఇక ఆ రెండు మూవీస్ అనంతరం ఇటీవల రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో టాప్ 5 గ్రాసింగ్ తెలుగు మూవీస్ లిస్ట్ లో ప్రభాస్, రాజమౌళి ల సినిమాలు మాత్రమే నిలిచాయి. ఆ విధంగా తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 365 కోట్ల గ్రాస్ తో ప్రథమ స్థానంలో నిలవగా రెండవ స్థానంలో బాబుబలి 2 రూ. 310 కోట్లు, మూడవ స్థానంలో సలార్ రూ. 213 కోట్లు, నాలుగవ స్థానంలో కల్కి 2898 ఏడి రూ. 200 కోట్లు (స్టిల్ రన్నింగ్), ఇక బాహుబలి 1 రూ. 184.34 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.

అయితే వీటిలో కల్కి ఫైనల్ గా ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ విధంగా టాలీవుడ్ టాప్ 5 గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో రాజమౌళివి మూడు సినిమాలు ఉండగా టాప్ 5లో నిలిచిన నాలుగు సినిమాలు కలిగిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలవడం గమనార్హం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version