పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడిల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా చిత్రీకరణ ఆగిపోయిన ఈ సినిమా చివరి దశకు షూటింగ్ ఇటీవల పూర్తయింది. జూన్ 12 న మూవీని గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ సీనియర్ నిర్మాత ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఇక నిన్న ఉదయం ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని ఒక ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రత్నం మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అదిరిపోతుందని జ్యోతి కృష్ణ, క్రిష్ ఇద్దరు కూడా అద్భుతంగా దీనిని తెరకెక్కించారని అన్నారు. మొత్తంగా మరొక మూడు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ థియేటర్స్ లో అందర్నీ ఆకట్టుకుంటాయని అన్నారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ మూడేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ నుంచి వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అనంతరం పెద్ద బ్లాక్ బస్టర్ ఖాయమని అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా విడుదలైన మూడవ సాంగ్ అసుర హననం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాలభైరవతో సహా మరి కొంతమంది సింగర్స్ పాడిన ఈ సాంగ్ ని రాంబాబు గోసాల రచించారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి యూట్యూబ్ లో బాగానే రెస్పాన్స్ లభిస్తోంది. త్వరలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది.