పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరపున టిడిపితో జతకట్టి కూటమిగా ఏర్పడి భారీ విజయం అందుకున్నారు. ఇక పిఠాపురం నుండి మంచి మెజారిటీతో ఎమ్యెల్యేగా గెలిచిన పవన్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇక మరోవైపు త్వరలో తాను పెండింగ్ లో పెట్టిన మూడు మూవీస్ ని త్వరలో పూర్తి చేసేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక పవన్ ప్రస్తుతం సుజీత్ తో ఓజి, క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తున్నారు. అయితే వీటిలో పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ఓజి ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆ మూవీకి సంబంధించి పెండింగ్ షూట్ ని అతి త్వరలో ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేయనున్నారని, అలానే ఆ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
కాగా ఈమూవీ మొదటి పార్టు సగభాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరక్కించగా మిగతా భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీస్తున్నారు. కాగా హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.