Home సినిమా వార్తలు Good News for Mega Fans రెండు నెలలు….మూడు మెగా పండుగలు

Good News for Mega Fans రెండు నెలలు….మూడు మెగా పండుగలు

mega family

మెగా ఫ్యాన్స్ కి రానున్న రోజుల్లో వీనులవిందైన సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా రానున్న డిసెంబర్ 6న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 మూవీ గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

అనంతరం డిసెంబర్ 20న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల క్రేజీ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట ల సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మొత్తంగా రెండు నెలల గ్యాప్ లో రానున్న ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version