టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ అందాల కథానాయక కియా అద్వాని హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోలేకపోయింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా కీలకపాత్రల్లో శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు నటించారు. రామ్ చరణ్ రెండు పాత్రలలో కనిపించిన ఈ మూవీలో ఆయన యాక్టింగ్ కి మాత్రం మంచి పేర్లు లభించింది.
విషయం ఏమిటంటే గేమ్ చేంజర్ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ క్లోజింగ్ కి చేరుకుంది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 7న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ తమ ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ మూవీ ఎంత మేరా ఓటీటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.