Home సినిమా వార్తలు Flop Movies Success Events ఫ్లాప్ మూవీస్ కి సక్సెస్ ఈవెంట్స్ అవసరమా

Flop Movies Success Events ఫ్లాప్ మూవీస్ కి సక్సెస్ ఈవెంట్స్ అవసరమా

mr bachchan

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇటీవల బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా రూపొంది విజయం సొంతం చేసుకున్న ది రెయిడ్ కి ఇది అఫీషియల్ రీమేక్. ఇక మిస్టర్ బచ్చన్ లో నూతన కథానాయిక భాగశ్రీ బోర్సే రవితేజకి జోడీగా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. అయితే ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. ప్రస్తుతం అనేక ఏరియాల్లో ఈ మూవీ పూర్తిగా చతికలబడింది. దీనితో నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవు.

అయితే ట్విస్ట్ ఏమిటంటే, తమ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది, అందరికీ కృతజ్ఞతలు అంటూ తాజాగా మిస్టర్ బచ్చన్ టీమ్ తాజాగా క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే దీని పై ఆడియన్స్ నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమా ఎలాగూ ఫ్లాప్ అయిందని తెలిసి కూడా ఇలా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడం అవసరమా అంటూ పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version