Home సినిమా వార్తలు Lucky Baskhar Postponed పోస్ట్ పోన్ అయిన ‘లక్కీ భాస్కర్’

Lucky Baskhar Postponed పోస్ట్ పోన్ అయిన ‘లక్కీ భాస్కర్’

luckybaskhar

యువ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం హీరోగా పలు సక్సెస్ లతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. అటు మలయాళంతో పాటు తెలుగులో కూడా ఆయ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హను రాఘవపూడి తీసిన సీతారామంతో ఇక్కడ కూడా భారీ విజయం అందుకున్న దుల్కర్ తాజాగా మరొక డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ డ్రామా థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్.

ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

విషయం ఏంటంటే, వాస్తవానికి లక్కీ భాస్కర్ ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన మేకర్స్ దానిని అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నేడు కొద్దిసేపటి క్రితం అనౌన్క్ చేసారు. సినిమా యొక్క అన్ని భాషల డబ్బింగ్ తో పాటు ఇతర టెక్నీకల్ కారణాల రీత్యా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version