యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీలో అందాల యువ కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయింది.
త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న తండేల్ మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి. తాజాగా మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ యువతని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తండేల్ అటు హిందీ, తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు టీమ్.
మొత్తంగా అయితే తమకు మాత్రం మూవీపై ముఖ్యంగా కంటెంట్ పై నమ్మకం ఉందని అంటున్నారు టీమ్ మెంబర్స్. ఇక గతంలో చైతు, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ బాగానే ఆడడంతో తప్పకుండా తండేల్ కూడా మరొక్కసారి వారిద్దరి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని వారి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరొక రెండు రోజుల్లో రిలీజ్ కానున్న తండేల్ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి