Home సినిమా వార్తలు Devisriprasad Hurts Mahesh Babu Fans మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన దేవిశ్రీప్రసాద్ 

Devisriprasad Hurts Mahesh Babu Fans మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన దేవిశ్రీప్రసాద్ 

devisriprasad

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. కెరీర్ బిగినింగ్ నుండి తన మ్యూజిక్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన దేవిశ్రీప్రసాద్ అటు తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసి ఎప్పటికప్పుడు తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. యువతలో మంచి క్రేజ్ కలిగిన దేవిశ్రీ దాదాపుగా టాలీవుడ్ లోని అందరు స్టార్ నటులతో మూవీస్ చేసి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. 

ఇక ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతిలో పుష్ప 2, కంగువ వంటి బడా సినిమాలు ఉన్నాయి. అప్పుడప్పుడు పలు కాన్సర్ట్ ల ద్వారా ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేసే దేవిశ్రీ నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో ఒక పెద్ద కాన్సర్ట్ ని నిర్వహించారు. అయితే ఆ కాన్సర్ట్ లో దేవిశ్రీ వ్యవహరించిన తీరు పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా అందరు స్టార్స్ తో పాటు తమ సూపర్ స్టార్ తో కూడా ఐదు మూవీస్ చేసిన దేవిశ్రీ, నిన్నటి కాన్సర్ట్ లో ఆయన సాంగ్స్ కి పెద్దగా ప్రిఫెరెన్స్ ఇవ్వలేదని, వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు, భారతే అనే నేను వంటి మూవీస్ కి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ వాటిలో ఒక్క పాపులర్ సాంగ్ ని కూడా పడలేదు. అయితే వన్ మూవీలోని క్లైమాక్స్ ఎమోషనల్ వీడియోని ప్లే చేసారు, దానితో పెద్దగా ఆసక్తి చూపని మహేష్ ఫ్యాన్స్ దేవిశ్రీ పై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version