Home సినిమా వార్తలు Devara Two Part Plan Backfires on Koratala Siva Career కొరటాల శివ కెరీర్‌పై...

Devara Two Part Plan Backfires on Koratala Siva Career కొరటాల శివ కెరీర్‌పై ‘దేవర – 2’ ప్లాన్ బ్యాక్‌ఫైర్ ?

koratala siva

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అందాల కథానాయక జాన్వి కపూర్ హీరోయిన్ గా ఇటీవల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తన తాజా పాన్ ఇండియన్ సినిమా దేవర పార్ట్ 1. ఇక మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విషయమైతే నమోదు చేసుకుంది. వాస్తవానికి మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఎన్టీఆర్ స్టార్డంతో పాటు భారీ టికెట్ రేట్స్ తో మంచి విజయం అందుకుంది.

ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రలు చేయగా రాక్ స్టార్ అనిరుద్ దీనికి సంగీతం అందించారు. ఇక దీని అనంతరం ప్రస్తుతం వార్ 2 అలానే ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇవి పూర్తయిన అనంతరం దేవర పార్ట్ 2 మూవీని చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా దేవర పార్ట్ 2 కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దాని ప్రకారం దేవర పార్ట్ 2 పై ఆశించిన స్థాయిలో ఆడియన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో టీమ్ దానిని ప్రక్కన పెట్టినట్లు చెప్తున్నారు. ఒకరకంగా ఈ మూవీని రెండు పార్ట్స్ గా తీయాలన్న కొరటాల శివ కెరీర్ కి ఇది బ్యాక్ ఫైర్ గా మారిందని అంటున్నారు. మరి దేవర పార్ట్ 2 మూవీ పక్కాగా ఇది సెట్స్ మీదకు వెళుతుందో లేదో తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు అని అంటున్నాయి సినీ వర్గాలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version