Home సినిమా వార్తలు Devara Benefit Shows Planning ‘దేవర’ : భారీ స్థాయిలో బెనిఫిట్ షోస్ ప్లానింగ్

Devara Benefit Shows Planning ‘దేవర’ : భారీ స్థాయిలో బెనిఫిట్ షోస్ ప్లానింగ్

Devara

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన దేవర మూవీ ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు ఈ మూవీ నుండి ఇప్పటికే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. సెప్టెంబర్ 27న ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

విషయం ఏమిటంటే, దేవర ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడే సమయానికి ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి 1 గం. కు భారీ లెవెల్లో ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి మాస్ యాక్షన్ మూవీ కావడంతో దేవరకు ఇది పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version