Home బాక్సాఫీస్ వార్తలు Devara All Time Record in Nizamఅక్కడ ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు కొట్టిన...

Devara All Time Record in Nizamఅక్కడ ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు కొట్టిన ‘దేవర’

devara

యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవర. ఈ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా అనిరుద్న్ సంగీతం అందించారు. 

అత్యంత గ్రాండ్ గా భారీ వ్యయంతో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన దేవర నేడు భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఫస్ట్ షో నుండి యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న దేవర రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో డే బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. 

అయితే విషయం ఏమిటంటే, ముఖ్యంగా టాలీవుడ్ కి కంచుకోటల్లో ఒకటైన నైజాం లో దేవర ​డే 1 మిడ్ నైట్ 1 ఏఎం ప్రీమియర్ షోస్ లో ఆల్ టైం రికార్డు సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. మొత్తంగా  1 ఏఎం షోస్ లో ఈ మూవీ రూ. 2.36 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాని రుజువు చేసింది. 

గతంలో టాప్ స్థానాల్లో నిలిచిన ఆర్ఆర్ఆర్, కల్కి, గుంటూరు కారం, సలార్ మూవీస్ ని వెనక్కి నెట్టి దేవర టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఓవరాల్ గా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న దేవర మొత్తంగా రాబోయే రోజుల్లో ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుని ఏ స్థాయి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version