నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ దసరా. అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అలానే ఈ మూవీ నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం.
ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు నాని. ఈ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, అతి త్వరలో మరొక్కసారి దసరా మూవీ క్రేజీ కాంబో రిపీట్ కానుంది. అయితే ఈసారి నానితో చేయనున్న తన కాంబో మూవీని భారీ రేంజ్ లో ప్లాన్ చేశారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో 1990 ల కాలం నాటి కథగా రూపొందనుందట. ఇప్పటికే స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం అయిన ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుందట. ముఖ్యంగా ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయించడంతో పాటు హై టెక్నీకల్ వాల్యూస్ తో దీనిని రూపొందించనున్నారట. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.