Home సినిమా వార్తలు Court Review Interesting Court Action Drama ‘కోర్ట్’ రివ్యూ : ఆకట్టుకునే కోర్ట్ యాక్షన్ డ్రామా 

Court Review Interesting Court Action Drama ‘కోర్ట్’ రివ్యూ : ఆకట్టుకునే కోర్ట్ యాక్షన్ డ్రామా 

court review

సినిమా పేరు: కోర్ట్: రాష్ట్రం Vs. ఎ ఎవరూ

రేటింగ్: 3.25/5

తారాగణం: ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి

దర్శకుడు: రామ్ జగదీష్

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

విడుదల తేదీ: 14 మార్చి 2025

తాజాగా నాచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా యువ దర్శకుడు రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కోర్ట్. యువ నటీ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీలో శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈమూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథ : 

కోర్ట్ మూవీ యొక్క కథ మొత్తం యువకుడు చందు (హర్ష్ రోషన్) ఇరుక్కున్న ఒక లీగల్ సమస్య చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా సమాజంలోని కీలకమైన పోక్సో యాక్ట్ సంబంధించి జరిగే వాదోపవాదనల నేపథ్యంలో ఆకట్టుకునే రీతిన తెరకెక్కింది ఈ మూవీ, ఆ కేసులో చందుకి ఏ విధంగా న్యాయం జరిగిందనేది మొత్తం తెరపై చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది లాయర్ గా అదరగొట్టిన ప్రియదర్శి గురించి. కెరీర్ పరంగా ఎన్నో కామెడీ పాత్రల్లో ఆకట్టుకున్న ప్రియదర్శి, అంతకముందు చింతిక్రింది మల్లేశం చిత్రంలో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రధాన పాత్రలు చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి కూడా బాగానే పెర్ఫార్మ్ చేసారు.

ఇక కోర్ట్ మూవీలో మరొక్కసారి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరిని ఆయన అలరించారు. అలానే నెగటివ్ పాత్రలో నటించిన శివాజీ కూడా అదరగొట్టారు. ఇక కీలక పాత్రలు చేసిన హర్ష వర్ధన్, సాయి కుమార్, రోహిణి కూడా తమ తమ పాత్రల యొక్క పరిధిమేరకు బాగానే నటించారు. 

విశ్లేషణ : 

యువ దర్శకుడు రామ్ జగదీశ్ ఈ మూవీని కీలమైన పోక్సో చట్టం అనే అంశం పై రాసుకుని ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారని చెప్పాలి. ప్రారంభంలో జూనియర్ లాయర్ తేజగా ప్రియదర్శిని చూపించిన అనంతరం ప్రధాన పాత్రల యొక్క కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీ బాగా చూపించారు.

అయితే కొంత సాధారణ రీతిన సాగిన ఈ సీన్స్ లో శివాజీ పవర్ఫుల్ ఎంట్రీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈమూవీ సెకండ్ హాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా కోర్ట్ మధ్యన సీన్స్ తో సాగుతుంది. ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్ లు వాదనలు, ప్రతివాదాలతో సీన్స్ అన్ని కూడా అంతకంతకు మూవీ పై ఆసక్తిని ఏర్పరుస్తాయి.

క్లైమాక్స్ బాగానే ఉంది, మైనారిటీ తీరని యువతకి సంబందించిన పోక్సో చట్టం గురించి పలు అంశాలు బాగా వివరించారు. ఫైనల్ గా అక్కడక్కడా లోపాలు ఉన్నప్పటికీ కోర్ట్ మూవీ ఆకట్టుకుంటుంది. అయితే ప్రతివాది లాయర్ గా హర్షవర్షన్ ని మరింత ఇంటెన్సిటీతో చూపించాల్సింది. 

ప్లస్ పాయింట్స్ : 

నటీనటుల పెర్ఫార్మన్స్

ఆకట్టుకునే స్క్రీన్ ప్లే

POCSO చట్టం దుర్వినియోగం గురించి ముగింపు ప్రసంగం

మైనస్ పాయింట్స్ :

టీనేజ్ ప్రేమకథలో చాలా సరళమైన సన్నివేశాలు

సెకండ్ హాఫ్ లో కీలకమైన కొన్ని సీన్స్ పేలవంగా అనిపించాయి

తీర్పు : 

మొత్తంగా అందరిలో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కోర్ట్ మూవీ ఆకట్టుకునే కథ, కథనాలు, స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అని చెప్పాలి. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగడంతో పాటు పోక్సో చట్టం గురించిన అంశాలు, డైలాగ్స్, నటీనటుల పెర్ఫార్మన్స్, నెరేషన్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ వారం కోర్ట్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి వీక్షించవచ్చు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version