Home సినిమా వార్తలు Court Movie Boxoffice Sensation Already Collected 24 Crores ‘కోర్ట్’ మూవీ బాక్సాఫీస్ : అప్పుడే...

Court Movie Boxoffice Sensation Already Collected 24 Crores ‘కోర్ట్’ మూవీ బాక్సాఫీస్ : అప్పుడే రూ. 24 కోట్లతో సెన్సేషన్

court

యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో యువ దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ కోర్ట్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీ మొడ్ఢతి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

ప్రీమియర్స్ నుండే సక్సెస్ టాక్ అందుకున్న కోర్ట్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ కొనసాగుతోంది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈమూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి అప్పుడే రూ. 24 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది. ముఖ్యంగా ఆకట్టుకునే కథ, కథనాలు, రెసి స్క్రీన్ ప్లే తో ఈ మూవీ అందరినీ అలరిస్తోంది. 

ప్రధాన పాత్రధారుల యొక్క ఆకట్టుకునే నటన, దర్శకుడి టేకింగ్ వంటివి దీనికి అదనపు బలాలు. ఇక ఈ మూవీ అటు అమెరికాలో సైతం సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈమూవీ అక్కడ హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకోగా ఫుల్ రన్ లో 1 మిలియన్ చేరుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. 

నాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించిన ఈమూవీని ప్రశాంతి త్రిపిర్నేనేని నిర్మించారు. మరి ఓవరాల్ గా కోర్ట్ మూవీ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version