Home సినిమా వార్తలు ‘ఛావా’ ఓటిటి : డిజప్పాయింట్ అయిన సౌత్ ఆడియన్స్

‘ఛావా’ ఓటిటి : డిజప్పాయింట్ అయిన సౌత్ ఆడియన్స్

chhaava

బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తరికెక్కిన తాజా హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా. చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. 

శివాజీ మరణానంతరం ఆయన రాజ్యాన్ని ఆక్రమించేందుకు ఔరంగజేబు ప్రయత్నించటం అదే సమయంలో శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ అడ్డగించడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ పర్ఫామెన్స్ కి అందరి నుంచి విశేషమైన క్రేజ్ లభించింది. 

తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అయితే ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా సౌత్ ఆడియన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. 

దానికి కారణం ప్రస్తుతం ఈ సినిమా ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండడం. ఇక ఇతర సౌత్ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆడియన్స్ వారు ఛావా యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కోసం చూస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడూ ఇతర భాషల్లో అందుబాటులోకి వస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version