Homeసినిమా వార్తలుసౌత్ ఇండస్ట్రీల ముందు వెలవెలబోతున్న బాలీవుడ్

సౌత్ ఇండస్ట్రీల ముందు వెలవెలబోతున్న బాలీవుడ్

- Advertisement -

కరోనా పాండేమిక్ వేవ్ ల తరువాత సినిమా ఇండస్ట్రీ లు కాస్త కుంటు పడిన మాట వాస్తవం. అయితే సౌత్ ఇండియా పరిశ్రమలు త్వరగానే కోలుకున్నాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది.ఈ వారం బాలీవుడ్ నుండి రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా కాగా మరొకటి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్. ఈ రెండు చిత్రాలు కూడా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. అంతే కాకుండా కలెక్షన్లు బాగాలేని కారణంగా చాలా చోట్ల నుండి స్క్రీన్‌లను తీసివేయవలసి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన కూడా లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా బంధన్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలోకి తీసుకురావడంలో తీవ్రంగా విఫలమయ్యాయి.

అందుకు భిన్నంగా తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రం ప్రస్తుతం మంచి రోజులు గడుస్తున్నాయి. బింబిసార, సీతా రామం, కార్తికేయ2 వంటి వరుస విజయాలతో టాలీవుడ్ తన హవాను కొనసాగిస్తోంది.

అటు తమిళ సినీ పరిశ్రమ కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. మార్చిలో శివ కార్తికేయన్ డాన్, జూన్ లో విడుదలైన లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ రకంగా తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ యేడాది ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లు గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్2 సినిమాల తాలూకు తమిళ వెర్షన్లు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఈ వారం హీరో కార్తీ నటించిన విరుమాన్ చిత్రం చక్కని ఓపెనింగ్స్‌ సాధించడంతో ట్రేడ్ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి.

READ  OTT రిలీజ్ కు రెడీ అవుతున్న అనుపమ బ‌ట‌ర్‌ఫ్లై

ఈ చిత్రం కార్తీకి కెరీర్-బెస్ట్ నంబర్‌లను నమోదు చేయడం విశేషం. అదే విధంగా, ఇటీవలే విక్రాంత్ రోనా వంటి ఘన విజయం తర్వాత కన్నడ పరిశ్రమ కూడా ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. కేజీఫ్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో పాటు, అటు కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను ఎంతో గొప్ప స్థాయిలో దక్కించుకున్న చార్లీ 777 వంటి అద్భుతమైన సినిమాని కన్నడ పరిశ్రమ అందించింది.

మలయాళ ఇండస్ట్రీ కూడా చక్కని విజయవంతమైన సినిమాలను అందించింది. హృదయం వంటి ఫీల్ గుడ్ హిట్, జనగణమన, కడువా ఇలా వరుస హిట్లతో చక్కని దశలో ఉంది. కాగా కెజీఫ్ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. ఇదిలా ఉండగా టోవినో థామస్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తల్లుమాల చిత్రం ఆగస్ట్ 12న విడుదలై అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.

ఇలా సౌత్ ఇండస్ట్రీలకు చెందిన అన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆనందింపజేస్తుంటే మరో వైపు బాలీవుడ్ సినిమా మార్కెట్ మాత్రం ఇప్పుడు కష్టాల్లో పడింది.

Follow on Google News Follow on Whatsapp

READ  నితిన్ తప్పేమీ లేదు: అమ్మ రాజశేఖర్ పై మండి పడుతున్న నితిన్ అభిమానులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories