Homeసినిమా వార్తలుటాలివుడ్: ఈ నెల తెలుగు సినిమాల రిపోర్ట్

టాలివుడ్: ఈ నెల తెలుగు సినిమాల రిపోర్ట్

- Advertisement -

గత కొన్ని నెలలుగాగా కాస్త అయోమయంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆగస్ట్ నెల తిరిగి మంచి రోజులు తీసుకు వచ్చింది. కాగా ఆగస్టు రెండో వారం..వారాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ సెలవుల నుండి వీలయినంత లాభాలను పొందాలనే ఉద్దేశ్యంతో రెండు సినిమాలైన మాచర్ల నియోజకవర్గం, కార్తీకేయ-2, మరియు బాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. అందులోమొదటగా, అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా విడుదలై ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఉన్నప్పటికీ.. సినిమా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల పై ఎలాంటి ఎటువంటి ప్రభావాన్ని సృష్టించలేకపోయింది.

శుక్రవారం విడుదల అయిన మాచర్ల నియోజకవర్గం తొలిరోజు వరకూ బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండో రోజు నుండి అనూహ్యంగా క్రాష్ అయ్యి డిజాస్టర్ వైపు పయనిస్తోంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఎం ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కాథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నటి అంజలి తో ఐటెం సాంగ్ చేయించి విస్తృతంగా ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది.

ఇక శనివారం విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 అద్భుతమైన టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా ఉండటమే కాక 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును సాధించే దిశగా దూసుకు పోతుంది. అంతే కాకుండా ఈ చిత్రం హిందీ వెర్షన్ కూడా విశేషమైన స్పందనను తెచ్చుకుని ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి రోజు రోజుకూ అదనపు స్క్రీన్‌లు జోడించబడుతున్నాయి.

READ  మరో రికార్డును సొంతం చేసుకున్న కేజీయఫ్ -2

గత వారం విడుదలైన బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఈ వారాంతంలో కూడా తమ లాంగ్ రన్ ను కొనసాగిస్తూ మంచు ప్రదర్శన కనబర్చాయి. ఈ రెండు తెలుగు సినిమాలు ఈ వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 3 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. కార్తికేయ 2, బింబిసార, మరియు సీతా రామం మూడు చిత్రాలు ఘన విజయం సాధించి ఎగ్జిబిటర్లకు, మరియు ట్రేడ్ వర్గాలకు సంతోషాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ హైప్ తో వస్తున్న లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానుండడంతో, టాలీవుడ్ తన విజయపంథాను కొనసాగించి మరిన్ని లాభాలను అర్హిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ మొదలు కానున్న భారతీయుడు 2 షూటింగ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories