కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ హీరోగా అందాల కథానాయిక త్రిష హీరోయిన్ గా తాజగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి నిన్న అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇటీవల అజిత్ హీరోగా తెరకెక్కిన విడాముయార్చి మూవీ డిజాస్టర్ కావడంతో నిరాశ చెందిన ఆయన ఫ్యాన్స్ కి తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ మంచి బూస్ట్ ని అందించింది.
ముఖ్యంగా టీజర్ లో అజిత్ మార్క్ స్టైల్, యాక్షన్ అదిరిపోయాయి. అలానే అజిత్ కి సంబందించిన గత సినిమాల్లోని ఆయన రెట్రో లుక్స్ ని ఇందులో చూపించి అందరిలో సినిమా పై మంచి ఆసక్తిని ఏర్పరిచారు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కావచ్చిన ఈ మూవీ టీజర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.