సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం జోరు మీద ఉంది. వరుసగా నాలుగు హిట్ లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అభిమానులతో పాటు నిర్మాతలను కూడా ఆనందింపజేస్తున్నారు.కరోనా పాండమిక్ రాకముందు 3 బ్లాక్ బస్టర్ విజయాలు మహేష్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక పాండమిక్ తర్వాత కూడా “సర్కారు వారి పాట”తో మరో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు, ఇటీవల ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న బిల్ గేట్స్ తో మహేష్ బాబు మరియు నమ్రత ఫోటో దిగటం జరిగింది. ఆ ఫోటో నిన్నటి నుంచి సోషల్ మీడియా లో వైరల్ అవుతునే ఉంది. అత్యంత విజనరీ మరియు ఆదర్శవంతమైన వ్యక్తి బిల్ గేట్స్ తో సమావేశం కావటం సంతోషం అంటూ మహేష్ తను,నమ్రత బిల్ గేట్స్ తో దిగిన ఫోటో పోస్ట్ చేయటం జరిగింది.
అయితే అందుకు బదులుగా బిల్ గేట్స్ కూడా మహేష్ ట్వీట్ ను క్వోట్ చేస్తూ “న్యూయార్క్ లో ఉండటం ఎప్పుడూ ఆనందమే..ఎందుకంటే ఎప్పుడు ఎవరు తారసపడతారో తెలియదు.మిమ్మల్ని కలవడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది మహేష్ మరియు నమ్రతా”అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దానికి ప్రతిస్పందనగా మహేష్ బిల్ గేట్స్ ట్వీట్ ను క్వోట్ చేసి మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.అంతే కాకుండా బిల్ గేట్స్ మహేష్ ను instagram మరియు Facebook లలో follow అవడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్… ఇండియాకి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా.. స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. తక్కువ టైమ్ లో సినిమా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత సినిమా చేయడం,వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.