Home సినిమా వార్తలు Summer releases: సమ్మర్ నుంచి వైదొలగిన పెద్ద సినిమాలు – మీడియం బడ్జెట్...

Summer releases: సమ్మర్ నుంచి వైదొలగిన పెద్ద సినిమాలు – మీడియం బడ్జెట్ సినిమాలకు అడ్వాంటేజ్

సాధారణంగా తెలుగు సినిమా పరిశ్రమలో సమ్మర్ అంటేనే చాలా మంది పెద్ద హీరోలు క్యూ కడుతుంటారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సమ్మర్ రిలీజ్ ల సందడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. హరి హర వీరమల్లు, భోళా శంకర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో 2023 సమ్మర్ కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు అలా జరిగేలా కనిపించడం లేదు.

హరి హర వీరమల్లు, భోళా శంకర్ సినిమాలను ముందుగా సమ్మర్ కు ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలు కూడా సమ్మర్ రేసులో నుంచి తప్పుకున్నాయి. అంటే సమ్మర్ లో పెద్ద రిలీజ్ లు ఉండవని, మీడియం, స్మాల్ బడ్జెట్ సినిమాలకు భారీ అడ్వాంటేజ్ ఉంటుందని సినీ వర్గాలు అంటున్నారు.

ఈ వేసవిలో వరుసగా మీడియం బడ్జెట్ సినిమాల రిలీజ్ లతో నిండిపోతుంది. నాని దసరా, అఖిల్ ఏజెంట్, విజయ్ దేవరకొండ ఖుషి, నాగచైతన్య కస్టడీ, సమంత శాకుంతలం, రవితేజ రావణాసురుడు, నిఖిల్ గూఢచారి, హనుమాన్ తదితర చిత్రాలు అన్నీ కూడా ఈ సమ్మర్ రిలీజ్ ను టార్గెట్ చేశాయి.

నాగచైతన్య, అఖిల్, నాని, విజయ్ దేవరకొండ ఈ హీరోల గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో ఒక పెద్ద హిట్ కోసం తహతహలాడుతున్నారు. సమంత కూడా స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. రవితేజ, నిఖిల్ లు బాక్సాఫీస్ వద్ద తమ గోల్డెన్ రన్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. టైర్-1 హీరో రిలీజ్ ల షెడ్యూల్ లేకపోవడంతో పై సినిమాలు బాక్సాఫీస్ వద్ద జాక్ పాట్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ గా కనిపిస్తుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version