Homeసినిమా వార్తలునెట్టింట వైరల్ గా మారిన బాలయ్య - మోక్షజ్ఞ పిక్

నెట్టింట వైరల్ గా మారిన బాలయ్య – మోక్షజ్ఞ పిక్

- Advertisement -

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తన కుమారుడి ప్రవేశంపై ఇప్పటికే చాలా సార్లు నర్మగర్భంగా సమాధానమిచ్చారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలోని చాలా దర్శకులతో మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కిస్తారని అనేక పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ పుకార్లలో ఎది కూడా కార్యరూపం దాల్చలేదు.

మోక్షజ్ఞ అరంగేట్రం పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురు చూస్తూ ఉండగా, నందమూరి అభిమానులను సంతోషింపజేసే విషయం ప్రస్తుతానికి ఒకటి ఉంది.మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులు ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. వారికి మరింత ఆనందాన్ని కలిగించే విషయం ఏమిటంటే, గతంలో లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న మోక్షజ్ఞ ఇంతకు ముందు కంటే మెరుగైన రీతిలో కనిపిస్తున్నారు. త్వరలోనే అయన తొలి సినిమా గూర్చి వార్త మనం వినవచ్చు అని తెలుస్తోంది. కాగా, బాలయ్య, మోక్షజ్ఞ జంటగా ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాలో బిజీగా ఉన్నారు. NBK107 గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా చిత్ర యూనిట్ ప్రస్తుతం విదేశీ షెడ్యూల్‌ను షూట్ చేస్తోంది.

READ  Box Office: స్పెషల్ షోలలో అల్ టైం రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ జల్సా

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని తెలిపారు. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు. గోపీచంద్ మల్లినేని ఈ సినిమా స్క్రిప్ట్ కోసం విస్తృతమైన పరిశోధనలు చేశారు. అలాగే గత సంవత్సరంలో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ఆ అనుభవాన్ని అంతా రంగరించి స్క్రిప్ట్ ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో వర్ధమాన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. NBK 107 సినిమాని క్రిస్మస్ వారాంతంలో డిసెంబర్ 23న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  నేనున్నాను నిఖిల్ అంటున్న మంచు విష్ణు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories