ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ సంస్థ పై తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కించిన సినిమా తమ్ముడు. దాదాపుగా రూ. 75 కోట్ల రూపాయల భారీ వ్యయంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా నెగటివ్ టాక్ అందుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిపారు దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ తో తమ సంస్థ నుంచి ఒక సినిమా రాబోయే రోజుల్లో రూపొందే అవకాశం ఉందని అయితే దానికి కొంత సమయం పడుతుంది అని చెప్పారు.
మరోవైపు ప్రభాస్ తో ప్రశాంత నీల్ దర్శకత్వంలో రావణం అనే సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు రాగా, తాజాగా అల్లు అర్జున్ తో దిల్ రాజు నిర్మించనున్న సినిమా రావణం అని అంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఆ ప్రతిష్టాత్మక సినిమా నిర్మించేందుకు ఇటు దిల్ రాజు గ్రాండ్ లెవెల్ లో ఇప్పటినుంచి అన్ని పనులు చక్కబెడుతున్నారట.
మరోవైపు అటు ప్రశాంత్ నెల్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఆ కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరమే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ ల రావణం తెరకెక్కుతుందనై, భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందనుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.